![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 మూడవ వారం ముగింపుకు వచ్చేసింది. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ సారి బిగ్ బాస్ ఉల్టా పల్టా థీమ్ తో కంటెస్టెంట్స్ ని తికమక చేస్తూ వారి సహనానికి పరీక్ష పెడుతున్నట్టుగా అనిపిస్తుంది.
అయితే ఇప్పటికి గత రెండు వారాల నుండి ప్రిన్స్ యావర్ కి అన్యాయం జరుగుతుంది. అతన్ని సీరియల్ బ్యాచ్ ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్ టార్గెట్ చేసినట్టుగా అర్థం అవుతుంది. ప్రియాంక జైన్ అటిట్యూడ్ చూస్తుంటే చూసే ప్రేక్షకులకు తన మీద అసహ్యం వేస్తుంది. శోభా శెట్టి, ప్రియాంక జైన్ కలిసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యావర్ ని తొలగించడంపై అందరికి వీళ్ళు చేసే పాలిటిక్స్ అర్థమవుతున్నాయి. ఇక హౌజ్ లో ఎవరికి బాధేసిన శివాజీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ లోకి వచ్చేముందు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉందని, బట్టలు కూడా ఎక్కువగా తీసుకోలేదని, వీళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారని శివాజీతో ప్రిన్స్ యావర్ చెప్పుకుంటూ ఏడ్చేశాడు. ప్రతీ ఒక్కడికి ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టు అని యావర్ కి ధైర్యం చెప్పాడు శివాజీ. అయితే ఈ వారం నామినేషన్లో ఉన్నవారిలో దామిణి పర్ఫామెన్స్ ఏమీ లేదు. దామిణి ఎలిమినేషన్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది.
శోభా శెట్టి మూడవ హౌజ్ మేట్ గా ఎంపిక అయితే తనకి మూడు వారాల ఇమ్యూనిటి లభిస్తుంది. దామిణి, రతిక, శుభశ్రీ ఈ ముగ్గరు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు. స్వల్ప ఓట్ల తేడాతో ఈ ముగ్గురు ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. అయితే శుభశ్రీ, దామిణి ఇద్దరికి ఓట్ల శాతం చాలా తక్కువ ఉండటంతో రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. అయితే శనివారం రిలీజ్ అయ్యే ప్రోమో కోసం ఇప్పటికే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడవ హౌజ్ మేట్ గా ఎవరు ఎంపిక అవుతారు. హోస్ట్ నాగార్జున ఎవరికి వార్నింగ్ ఇస్తాడనే అంశాలతో ఈ వారం మరింత ఉత్కంఠని కలిగిస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.
![]() |
![]() |